భోగాపురం 80% జగన్ పూర్తి చేశారు.. 20% మాత్రమే చంద్రబాబు చేశారు

    –క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు, లోకేష్.. –ప్రజలు వాస్తవాలు గుర్తించాలి: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి   సలాం ప్రొద్దుటూరు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో 80 శాతం పనులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులను మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక రామేశ్వరంలోని మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...