డి-కేటగిరీ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామంలో గ్రామసభ – ‘పల్లెనిద్ర’ నిర్వహించిన సీఐ నాగభూషణ్

  సలాం   ప్రొద్దుటూరు: ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలను పటిష్ఠం చేయడం, నేరాల నివారణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రొద్దుటూరు రూరల్ రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని డి-కేటగిరీ ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన చిన్నశెట్టిపల్లిలో ప్రత్యేక గ్రామసభతో పాటు "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ నాగభూషణ్ గ్రామస్థులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై...