SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 1:51 pm Posted by : SALAM PRODDATUR

పేదల సేవలో భాగంగా ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

 

 

సలాం ప్రొద్దుటూరు:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 25వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు నూరి స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.అలాగే కార్యక్రమంలో సీఎస్ ఇస్మాయిల్, మహబూబ్ బాషా, నాగరాజు, మహమూద్తో పాటు సంబంధిత సచివాలయ సిబ్బంది పాల్గొని పెన్షన్ల పంపిణీని విజయవంతంగా నిర్వహించారు.