SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 2:39 am Posted by : SALAM PRODDATUR

నేడు పులివెందుల కు జగన్

సలాం ప్రొద్దుటూరు (పులివెందుల)  :

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పులివెందులకు రానున్నారు. తన చిన్నాన్న వైఎస్ ఆనందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన పులివెందుల చేరుకోనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు.

 

వైఎస్ ఆనందరెడ్డి గురువారం అనారోగ్యంతో కన్నుమూయగా, శుక్రవారం పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పులివెందుల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.