శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గంగమ్మ తల్లి

  సలాం ప్రొద్దుటూరు:   ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బజార్ వీధిలో ఉన్న శ్రీ గంగమ్మ దేవాలయంలో అమ్మవారిని శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, హారతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.   అమ్మవారిని శాకాంబరి రూపంలో దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబాల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధి కలగాలని అమ్మవారిని వేడుకున్నారు....