పట్టణంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి–ఎం పి జె
సలాం ప్రొద్దుటూరు: పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతూ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) ప్రతినిధులు నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాధ్ను కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్రజా భద్రతకు ముప్పుగా మారుతున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మడూరు కాల్వకు రక్షణ కంచె ఏర్పాటు చేయాలి మడూరు కాల్వ పరిసరాల్లో రక్షణ కంచె...