SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:35 pm Posted by : SALAM PRODDATUR

నంద్యాల కొండారెడ్డి నాయకత్వంలో ‘ఇంటింటికీ టీడీపీ’కి ఊపందిన ప్రచారం

–కూటమి పాలన రెండేళ్ల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన యువనేత..

–40వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమానికి విశేష స్పందన

సలాం ప్రొద్దుటూరు:

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ‘ఇంటింటికీ టీడీపీ – కూటమి పాలన 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పొందుతోంది. నాలుగో రోజు మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో కొండారెడ్డి స్వయంగా ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ప్రజల ముంగిటకు చేరిన నంద్యాల కొండారెడ్డి
ఇంటింటికీ వెళ్లిన నంద్యాల కొండారెడ్డి ప్రతి కుటుంబంతో ఆత్మీయంగా మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలు సూచించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కూటమి పాలన విజయాలపై విస్తృత ప్రచారం
రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన తెలుసుకుంటూ, పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని నింపారు.
కొండారెడ్డి రాకతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
నంద్యాల కొండారెడ్డి నాయకత్వంలో జరిగిన ప్రచారానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆయన రాకతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా, వార్డు వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
భారీగా పాల్గొన్న కూటమి నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, ప్రొద్దుటూరు టీడీపీ పరిశీలకురాలు కొండవీటి భావన, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా, పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు, మహిళా నాయకులు, వార్డు ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.