25వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ జోరు..

–ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, యువనేత నంద్యాల కొండారెడ్డి సూచనలతో డోర్ టు డోర్ ప్రచారం సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువనేత నంద్యాల కొండారెడ్డి సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రభుత్వ విజయాల వివరణ డోర్ టు డోర్ ప్రచారంలో...