అవినీతిని అరికట్టలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి– కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా
–బెట్టింగ్, భూ మాఫియా, ఆక్రమణలు, కాంట్రాక్టర్ల బిల్లులు, అధికారులపై ఒత్తిళ్లపై తీవ్ర ఆరోపణలు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో అవినీతి విస్తృతంగా ఉందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయన తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా గడిచిన తర్వాత అవినీతి ఉందని చెప్పడం పరిపాలనా వైఫల్యాన్ని...