మున్సిపల్ హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
–మూడు రోజులుగా పెట్రోల్ స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం.. –ఇద్దరు సిబ్బందికి తాఖీదులు సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకును మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు నిర్వహణ, ఇంధన నిల్వలు, సేవల నాణ్యత, పారదర్శకతపై సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ స్టాక్ లేకపోవడంపై ఆగ్రహం గత మూడు రోజులుగా పెట్రోల్ స్టాక్ లేకపోవడాన్ని గుర్తించిన...