ప్రజలకు సేవ చేయండి.. లంచాలకు దూరంగా ఉండండి– ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవను తమ ప్రధాన బాధ్యతగా భావించి నిజాయితీ, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని లంచాలకు దూరం ఉండాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హితవు పలికారు .బుధవారం స్థానిక నెహ్రూ రోడ్ లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.ప్రజల నుంచి లంచాలు ఆశించడం ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని పేర్కొంటూ, అవినీతికి తావులేకుండా బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం "లంచాలు తీసుకోవడానికే స్వాతంత్య్రం...