కూటమి పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ… బొల్లవరంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం

  సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బొల్లవరంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా, అభివృద్ధి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయా అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను...