SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 6:53 pm Posted by : SALAM PRODDATUR

కూటమి పాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ… బొల్లవరంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం

 

సలాం ప్రొద్దుటూరు:

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు బొల్లవరంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా, అభివృద్ధి పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయా అనే అంశాలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.

 

ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వ పనితీరుపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, శ్రీ అగస్తేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్ వంగల నారాయణరెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర, జనసేన నాయకులు ప్రసాద్, తిప్పిరెడ్డి పల్లె దస్తగిరి, ఈశ్వర్‌రెడ్డి, నాగార్జున, మాజీ కౌన్సిలర్ కమాల్ బాషా, మౌలాలి, సుబ్బారెడ్డి, మోడంపల్లె రవి , స్థానిక నాయకులు యనమల రామసుబ్బారెడ్డి, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన చైర్మన్ దాతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మాజీ కౌన్సిలర్ పొడావుల రమణ, ధనిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, యనమల రాజగోపాల్‌రెడ్డి, యనమల సుబ్బిరెడ్డి, ధనిరెడ్డి పృథ్వీ, యనమల ఉమామహేశ్వరరెడ్డి, గుద్దేటి శ్రీనివాసులరెడ్డి, పొడావుల వెంకట కిరణ్, సహదేవరెడ్డి, రవీంద్రరెడ్డి, నరాల బాలిరెడ్డి, గౌరు పవన్‌కుమార్‌రెడ్డి, దొంతిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాదిరెడ్డి సతీశ్వర్‌రెడ్డి, గంగుల రాజేష్‌రెడ్డి, లాయర్ రాజేష్‌రెడ్డి, గోపిరెడ్డి ఆంజనేయులురెడ్డి, పాతపాటి శ్రీనివాసులురెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, పొడావుల శ్రీనివాసులు, బద్వేలు గురుప్రసాద్‌రెడ్డి, చెన్నూరు నరసింహరెడ్డి, గాలి లక్ష్మీనారాయణ, గాలి పెద్ద ఓబన్న, బాయికాద గఫూర్, కార్పెంటర్ బాషా తదితరులు పాల్గొన్నారు.