భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డా. వి.ఎస్. ముక్తియార్

–ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అంతర్జాతీయ విమానాశ్రయం సలాం ప్రొద్దుటూరు (గజపతినగరం): ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేయనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం నేపథ్యంలో, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ బుధవారం విమానాశ్రయ ప్రాంగణంలో...