ప్రజాభిప్రాయం ఎటు వైపో..?
–కొత్తపల్లి పంచాయతీ విలీనంపై ముగిసిన ప్రజాభిప్రాయం –భారీగా పాల్గొన్న గ్రామస్తులు.. తుది నిర్ణయంపై అందరి దృష్టి సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలంలోని మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లిని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ ప్రక్రియలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అధికారుల ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ కొనసాగగా, సుమారు 1,100 మంది గ్రామస్తులు తమ...