ప్రజాభిప్రాయమే తుది నిర్ణయానికి ప్రామాణికం–మున్సిపల్ కమిషనర్

    సలాం  ప్రొద్దుటూరు: గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై నిర్వహించిన గ్రామసభలో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా నమోదు చేయించడమే ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం కొత్తపల్లి పంచాయతీ వద్ద నిర్వహించిన ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వ్యవస్థలకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు, బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ...