పంచాయతీలను విలీనం చేసి ప్రొద్దుటూరుకు కార్పొరేషన్ హోదా కల్పించాలి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలను విలీనం చేసి పట్టణానికి కార్పొరేషన్ హోదా కల్పించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రొద్దుటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేత నాగమునిరెడ్డి, సినీ హబ్ రాజేశ్వర రెడ్డి ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లెతో పాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధికి ఆనుకుని ఉన్న ఇతర గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేయాలని సూచించారు....