“మన ప్రాంతం.. మన పంచాయతీని నిలుపుకుందాం”–మల్లెల ఝాన్సీ 

    సలాం ప్రొద్దుటూరు:    కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీ/కార్పొరేషన్ పరిధిలో విలీనం చేసే ప్రతిపాదనపై నిర్వహించిన గ్రామసభలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్ - APCOB) మాజీ ఛైర్‌పర్సన్‌ మల్లెల ఝాన్సీ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆమె కోరారు. పంచాయతీ నుంచి కార్పొరేషన్ పరిధిలోకి విలీనం అయితే పన్నుల భారం పెరిగే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఖాళీ స్థలం కూడా...