“పంచాయతీని కాపాడుకుందాం.. విలీనంపై ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి”–మాజీ సర్పంచ్ కొనిరెడ్డి

  –గ్రామ పంచాయతీ వ్యవస్థతోనే ప్రజలకు మెరుగైన సేవలు   సలాం  ప్రొద్దుటూరు: కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసే అంశంపై నిర్వహించిన గ్రామసభలో  మంగళవారం మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీ వ్యవస్థకు మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండే స్థానిక స్వపరిపాలన వ్యవస్థ అని, విలీనం వల్ల కలిగే లాభనష్టాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ పరిధిలో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రోడ్డు...