కొత్తపల్లెలో భారీ బందోబస్తు మధ్య గ్రామసభ..
–ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ మళ్లీ నిర్వహణ సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో భాగంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మంగళవారం మరోసారి గ్రామసభ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ గ్రామసభను భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఇప్పటికే చౌటపల్లె, దొరసానిపల్లె, గోపవరం గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించగా, విలీనానికి అధిక సంఖ్యలో ప్రజలు మద్దతు...