కార్పొరేషన్‌తో బ్యాంకింగ్ సేవల విస్తరణ.. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధికి ఊతం– బి.వి. సుబ్బారెడ్డి

      సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరును కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తే పట్టణం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధించడంతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ బి.వి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.   ప్రస్తుతం ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సేవలు మున్సిపాలిటీ పరిధికే పరిమితమై ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్తపల్లితో పాటు ప్రతిపాదిత గ్రామపంచాయతీలు ప్రొద్దుటూరు పరిధిలో విలీనం చెంది భవిష్యత్తులో కార్పొరేషన్‌గా ఏర్పడితే, బ్యాంకు సేవలను కార్పొరేషన్ పరిధి అంతటా...