కార్పొరేషన్ హోదాతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.. వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి
–విలీనానికి సహకరించాలనీ గ్రామసభలో బసిరెడ్డి పిలుపు సలాం ప్రొద్దుటూరు: కొత్తపల్లి గ్రామ పంచాయతీని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేసి, భవిష్యత్తులో కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లడం ద్వారానే గ్రామానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామసభలో వ్యాపారవేత్త బసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ గ్రామాభివృద్ధిపై సమిష్టిగా చర్చించి కార్యాచరణ చేపట్టిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన...