SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:07 am Posted by : SALAM PRODDATUR

ఉదయం 5 గంటల నుంచే క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటన.. 1వ డివిజన్‌లో పారిశుధ్య పనుల పరిశీలన

 

 

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మంగళవారం ఉదయం 5 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ 1వ డివిజన్‌లోని మాస్టర్ పాయింట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల పనితీరును సమీక్షించి, పట్టణ పరిశుభ్రతను మరింత మెరుగుపరిచేలా పలు సూచనలు చేశారు.

 

పారిశుధ్య నిర్వహణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చెత్త సేకరణను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులు, పట్టణ ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే పరిశుభ్రమైన ప్రొద్దుటూరు నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

 

ప్రతి పౌరుడు పరిశుభ్రత పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కమిషనర్ పిలుపునిస్తూ, “మన ప్రొద్దుటూరు – మన బాధ్యత… పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో అందరం భాగస్వాములమవుదాం” అనే సందేశాన్ని ప్రజలకు అందించారు.