సలాం ప్రొద్దుటూరు:
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికీ టీడీపీ – డోర్ టు డోర్” కార్యక్రమం కొనసాగుతోంది.
శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు, ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ఆధ్వర్యంలో 25వ వార్డు టీడీపీ నేత ఖాదర్ వలీ వార్డు పరిధిలో సోమవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు, సూచనలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పార్టీ శ్రేణులు ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, ప్రభుత్వంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.