SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 9:02 pm Posted by : SALAM PRODDATUR

25వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం..

 

– ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు అవగాహన

 

ప్రొద్దుటూరు:

శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ యువ నాయకులు  నంద్యాల కొండా రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని 25వ వార్డులో “ఇంటింటికీ టీడీపీ” కార్యక్రమాన్ని సోమవారం టీడీపీ సీనియర్ మైనారిటీ నాయకులు నూరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 

ఈ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ జబీబుల్లా, క్లస్టర్ ఇన్‌చార్జ్ తలారి రమేష్, బూత్ ఇన్‌చార్జ్‌లు ఇస్మాయిల్, పీవీ మక్బూల్, నాగరాజు, మౌలాలి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.