SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 12:38 am Posted by : SALAM PRODDATUR

కేంద్ర విద్యాశాఖకు ప్రహ్లాద్ జోషీకి అదనపు బాధ్యతలు

–ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

 

సలాం ప్రొద్దుటూరు (న్యూఢిల్లీ):

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీకి ఆయన ప్రస్తుత శాఖలతో పాటు విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

 

ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖలను నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషీ, ఇకపై తాత్కాలికంగా కేంద్ర విద్యాశాఖ వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు.

 

విద్యాశాఖకు శాశ్వత మంత్రిని నియమించడంపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.