ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!
–సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు – అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు సలాం ప్రొద్దుటూరు (అమరావతి): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, ఎంపీటీసీ–జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను దశలవారీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుండగా, అనంతరం ఎంపీటీసీ–జడ్పీటీసీ ఎన్నికలు, చివరి విడతలో అక్టోబర్ రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి....