ప్రతి సోమవారం ‘ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ’ కార్యక్రమం
–ఫోన్ ద్వారానే ప్రజా సమస్యల స్వీకరణ.. –సత్వర పరిష్కారానికి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చర్య సలాం ప్రొద్దుటూరు: ప్రజలకు మున్సిపల్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ప్రజలతో కమిషనర్ ముఖాముఖీ' పేరుతో ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించే కార్యక్రమాన్ని జూలై 27, 2026 నుంచి అమలు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ వెల్లడించారు....