కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: ఆర్‌ఎస్‌ఎఫ్ డిమాండ్
–రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం.. కడపలో పోలీసుల తీరుపై ఆగ్రహం సలాం ప్రొద్దుటూరు (కడప): నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం (ఆర్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు డి.యం. ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌లో భాగంగా కడపలో శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని...