సలాం ప్రొద్దుటూరు:
పోలవరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను (PGRS) జిల్లాలో సమర్ధవంతంగా నడిపి 4.5% పాజిటివిటీ ప్రజలలో పెంచి విశేష సేవలు అందించిన ప్రొద్దుటూరు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు, అధికారులు సమక్షంలో ప్రజా వేదిక మీద అభినందించారు. పోలవరం జిల్లా, రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ & టీచర్స్ రాష్ట్రస్తాయి ఆత్మీయ సమావేశంలో శ్రీనివాస విశ్వనాధ్ కు ఈ గౌరవం దక్కింది. ప్రొద్దుటూరు మున్సిపల్ కమీషనర్ గా రాకముందు శ్రీనివాస విశ్వనాధ్ పోలవరం జిల్లాకు పి.జీ.ఆర్.ఎస్ నోడల్ అధికారిగా వ్యవహారించారు.