ఎస్ఐఆర్ చివరి రోజున చాపాడు మండలంలో పోలింగ్ బూత్ ల పరిశీలన
సలాం ప్రొద్దుటూరు (చాపాడు): చాపాడు మండల కేంద్రంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం చివరి రోజున మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) రామకుమారి, డిప్యూటీ తహసీల్దార్ ఎన్.ఎల్. కృష్ణారెడ్డి 147, 148 పోలింగ్ బూత్లను శుక్రవారం సందర్శించి కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, నమోదవుతున్న దరఖాస్తులు, బూత్లలో చేపడుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో 147వ పోలింగ్ బూత్ బీఎల్వో సుప్రజ, 148వ పోలింగ్ బూత్...