SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 12:19 am Posted by : SALAM PRODDATUR

బీసీ మహిళా హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా

 –పాల్గొన్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు

సలాం ప్రొద్దుటూరు (కడప):

కడప నగరంలోని కో-ఆపరేటివ్ కాలనీలో శుక్రవారం  బీసీ మహిళా హాస్టల్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కడప జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు సాయి తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్‌లో విద్యార్థినులకు అందుతున్న వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించిన వారు, విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో ఉన్న లోపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.