కలికిరి ఎస్టీ కాలనీలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు
సలాం ప్రొద్దుటూరు (కలికిరి): అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఎస్టీ కాలనీలో శనివారం ఏకలవ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, భారతీయ చరిత్రలో ఏకలవ్య గురుభక్తి, త్యాగం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. గిరిజన సమాజానికి ఏకలవ్య జీవితం...