ఖాదర్పల్లి ఉర్దూ పాఠశాలలో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 నిర్వహణ
సలాం ప్రొద్దుటూరు (ఖాదర్పల్లి ): చాపాడు మండలం ఖాదర్పల్లి ఎంపీపీ ఉర్దూ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 4.0 కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారి బడి బయట కాకుండా బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం"...