సలాం ప్రొద్దుటూరు (ఖాదర్పల్లి ):
చాపాడు మండలం ఖాదర్పల్లి ఎంపీపీ ఉర్దూ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం) 4.0 కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారి బడి బయట కాకుండా బడిలోనే ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి వంద శాతం లబ్ధి అందిస్తోందని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకు నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఖాదర్పల్లి సర్పంచ్ అమ్మాజీ, ఉపసర్పంచ్ జైనుల్, నాయకుడు పాచా మాబు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.