విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది–ఎంఎల్ఎ వరద

–మెగా పేరెంట్స్ మీటింగ్‌లో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి   – తల్లిదండ్రులకు బాధ్యతాయుత సూచనలు   సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని ఎద్దుల వెంకటసుబ్బమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యాభివృద్ధిపై పలు సూచనలు చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ "నేటి పిల్లలే రేపటి పౌరులు" అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పిల్లల...