నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై నిరసన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని PRSYF డిమాండ్
సలాం ప్రొద్దుటూరు (కడప ): నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నిరసనగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తూ ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం (PRSYF) ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా...