విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం కీలకం: డా. వి.ఎస్. ముక్తియార్
సలాం ప్రొద్దుటూరు: స్థానిక మోడంపల్లిలోని మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షేక్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. వి.ఎస్. ముక్తియార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి, అభ్యాస సామర్థ్యాల పెంపు, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల పాత్రపై ఆయన సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కుటుంబం, పాఠశాల కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని...