స్టాంప్ రైటర్లను తొలగించే జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోవాలి– ఇర్ఫాన్ బాషా
సలాం ప్రొద్దుటూరు: స్టాంప్ రైటర్లను తొలగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట స్టాంప్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పెన్‌డౌన్ నిరసన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా స్టాంప్ రైటర్ల సమస్యలను తెలుసుకున్న ఇర్ఫాన్ బాషా, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న...