గృహలేఖ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్’ ప్రారంభించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని గాయత్రి ఆస్పత్రి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'గృహలేఖ ఇంటీరియర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్' సంస్థను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి సంస్థను ప్రారంభించిన ఆయన, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాణ్యమైన అంతర్గత అలంకరణ, నిర్మాణ సేవలను అందించి ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంస్థ విజయవంతంగా అభివృద్ధి చెందాలని...