SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 1:09 am Posted by : SALAM PRODDATUR

27 నుంచి ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి– ఎమ్మెల్యే వరద

 

సలాం ప్రొద్దుటూరు:

 

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు జూలై 27 నుంచి ప్రారంభమయ్యే 45 రోజుల డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

టీడీపీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక భారత్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

 

“జూలై 27 నుంచి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి 45 రోజుల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని ఎమ్మెల్యే సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహమ్మద్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, శివాలయం చైర్మన్ వంగల నారాయణరెడ్డి, టీడీపీ ప్రొద్దుటూరు పరిశీలకురాలు కొండవీటి భావన, టీడీపీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబివుల్లా, బీజేపీ జిల్లా కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఈ.వి. సుధాకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి, కామిశెట్టి బాబు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.