విద్యార్థుల గొంతును అణచొద్దు.. లాఠీచార్జిపై మండిపడ్డ MPJ–JIH–IYM–SIO నాయకులు
సలాం ప్రొద్దుటూరు: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద NEET పేపర్ లీక్ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని MPJ, JIH, IYM, SIO సంస్థల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, విద్యార్థుల గొంతును లాఠీలతో అణచివేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రొద్దుటూరులోని...