హజ్రత్ సయ్యద్ షా మెహమూద్ బాషా బుఖారి (రహ్.) 9వ వార్షిక ఉర్స్-ఏ-షరీఫ్ ఘనంగా నిర్వహణ
సలాం ప్రొద్దుటూరు (కలికిరి): : అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మహల్ గ్రామంలోని హకీమ్ హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా మెహమూద్ బాషా బుఖారి (రహ్.) దర్గా షరీఫ్‌లో 9వ వార్షిక ఉర్స్-ఏ-షరీఫ్ వేడుకలు బుధవారం అర్ధరాత్రి వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఉర్స్ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమం ఖుల్ (ప్రత్యేక ప్రార్థనలు), పవిత్ర ఖుర్‌ఆన్ పారాయణంతో...