అమ్మఒడి’కి పేరు మార్చినా ఆలోచన మార్చలేరు.. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు: రాచమల్లు
–రూ.15 వేల హామీ ఏమైంది?.. –20 లక్షల మంది విద్యార్థులను ఎందుకు పథకం నుంచి తప్పించారు? –ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు– మాజీ ఎమ్మెల్యే విమర్శ సలాం ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అమ్మఒడి' పథకాన్నే ప్రస్తుతం 'తల్లికి వందనం' పేరుతో అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేర్లు మార్చడం తప్ప విద్యార్థుల...