SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 10:57 am Posted by : SALAM PRODDATUR

డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ సస్పెన్షన్

సలాం ప్రొద్దుటూరు (అల్లూరి జిల్లా):

అల్లూరి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కృష్ణమూర్తి నాయక్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

 

అక్రమ డిప్యూటేషన్లు, ఉద్యోగులను వేధించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణమూర్తి నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.