రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి– ఎమ్మెల్యే వరద

సలాం ప్రొద్దుటూరు: నీటి కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని, వర్షాల కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. బుధవారం నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశువులకు మేత కొరత కూడా తీవ్రంగా ఉందని, రైతులతో పాటు వ్యవసాయ కూలీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 'తల్లికి వందనం'తో ప్రతి విద్యార్థికి...