అమృత్ నగర్ లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

సలాం ప్రొద్దుటూరు:   ప్రొద్దుటూరు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ మరియు జిల్లా అంధత్వ నివారణ సొసైటీ, కడప సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి ఐఓఎల్ పరీక్షా శిబిరం బుధవారం కొత్త అమృత్ నగర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ప్రొద్దుటూరు రోటరీ కంటి ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా క్యాటరాక్ట్ (ముత్యబిందు) శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు....