SALAM PRODDATUR
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 11:06 am Posted by : SALAM PRODDATUR

అమృత్ నగర్ లో ఉచిత కంటి పరీక్షా శిబిరం

సలాం ప్రొద్దుటూరు:

 

ప్రొద్దుటూరు రోటరీ సర్వీస్ కాంప్లెక్స్ ట్రస్ట్ మరియు జిల్లా అంధత్వ నివారణ సొసైటీ, కడప సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి ఐఓఎల్ పరీక్షా శిబిరం బుధవారం కొత్త అమృత్ నగర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు.

ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ప్రొద్దుటూరు రోటరీ కంటి ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా క్యాటరాక్ట్ (ముత్యబిందు) శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శస్త్రచికిత్స పొందే వారికి లెన్స్, భోజనం, వసతి, కంటి అద్దాలు పూర్తిగా ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ శర్మ, రోటరీ ట్రస్ట్ కార్యదర్శి బేపారి జాకీర్ అహ్మద్, రొటేరియన్లు రవి, బాల సూర్యరావు, కేటీ రవి రెడ్డి, వెంకటేశ్వర్లు, జీవీ రమణ, రాజ్‌కుమార్, రోటరాక్టర్లు కార్తికేయ, చంద్రబాబు, ప్రసాద్ రెడ్డి, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.