మద్యం–గంజాయి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం–ఐద్వా
–చర్యలు తీసుకోకపోతే వైన్ షాపుల వద్ద ఉధృత ఉద్యమం ఐద్వా హెచ్చరిక –ప్రొద్దుటూరులో వైన్ షాపు ఎదుట ధర్నా.. రాజీవ్ సర్కిల్ వరకు మహిళల ర్యాలీ సలాం ప్రొద్దుటూరు: రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరులో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని వైన్ షాపు ఎదుట ధర్నా చేపట్టిన మహిళలు అనంతరం రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి...