మధుర జ్ఞాపకాలతో పదవీ విరమణ.. ఎనుముల జయమ్మ దంపతులకు ఘన సన్మానోత్సవం

సలాం ప్రొద్దుటూరు (వనపర్తి):   ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా విద్యారంగంలో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన ప్రముఖ ఉపాధ్యాయిని ఎనుముల జయమ్మ సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని దక్ష లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఆమెకు ఘనంగా పదవీ విరమణ సన్మానోత్సవాన్ని నిర్వహించారు.   ఎనుముల జయమ్మ 1989 సంవత్సరంలో స్పెషల్ టీచర్‌గా ప్రభుత్వ విద్యాశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 36 సంవత్సరాల పాటు...